Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు రసవత్తరంగా సాగుతుంది. ఒక్కరికి మించి మరోకరు తెగ నటిస్తున్నారు. సోమవారం నామినేషన్స్ లో మాత్రం నానా రచ్చ చేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మరి పచ్చిగా చెప్పాలంటే.. సైకోల్లా ప్రవర్తించారు. కానీ, మంగళవారం ఎపిసోడ్‌లో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కాస్త ఫన్నీగానే గడిపారు. ప్రియా, రవి, నటరాజ్, కాజల్ ఇలా అందరు తమ మధ్య ఉన్న సమస్యల గురించి మాట్లాడుకున్నారు. లోబో తన తప్పు తెలుసుకోని.. ప్రియకు సారీ చెప్పాడు. కానీ. రవితో మాట్లాడేందుకు కాజల్ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఈ విషయంలో మానస్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
మరోవైపు .. చిత్ర విచిత్రమైన ప్రవర్తన చేయడం, వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో నటరాజ్ మాస్టర్ చుట్టూ షో నటించింది. ఈ సమయంలో గుంటనక్క మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది. గుంటనక్క అని నన్నే అన్నావ్ కదా అని యాంకర్ రవి మాస్టర్ని అడిగాడు. అసలు .. నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావ్ అని పంచ్ వేశాడు నటరాజ్ మాస్టర్. ఆ విషయాన్ని పక్కన పెట్టుకాని .. ఇంటి నుంచి పికాక్ ఎగిరిపోయిందని.. లహరిని ఉద్దేశించి జోక్ చేశాడు.
సరే కానీ గుంటనక్క ఎవరో చెప్పండంటూ పదేపదే ప్రశ్నించారు రవి. కానీ మాస్టర్ ఓపెన్ కాలేదు. ప్రతివారం నాగార్జున గారు.. గుంటనక్క ఎవరంటే.. అందరూ నా వైపు అదోలా చూస్తున్నారు.. నాకు ఎట్లా ఉంటుంది అన్నా..నా పరిస్థితి దారుణంగా ఉంది. సభ్యుల ముందు చులకన అయిపోయాను. అని రవి అడగ్గా ..దీంతో నటరాజ్ మాస్టర్ అసలు విషయాన్ని బయట పెట్టాడు.
నువ్వు ఎవర్నీ ప్రభావితం చేయకు.. నాకు ఆ పాయింట్లో అలా అనిపించింది అంతే.. నువ్ ఫీల్ కాకు అని సలహా ఇచ్చాడు. అసలు ఆ మాటను తాను ఎప్పుడో మార్చిపోయానని అన్నాడు. కానీ, ఓ ఊసరవెళ్లి తన దగ్గరకు వచ్చి రవికి గుంటనక్క అని కరెక్ట్‌గా పేరు పెట్టారని అన్నాడంటూ విశ్వని ఇరికించాడు.
దీంతో వెంటనే రవి.. విశ్వ దగ్గర వెళ్లి.. . `నేను విశ్వ అన్నా.. విశ్వ అన్నా` అని అంటుంటే నువ్ మాస్టర్ దగ్గరకు పోయి.. గుంటనక్క అని వాడికి కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నావట’అని విశ్వని నిలదీశాడు రవి.
ఆ మాటలు విన్న.. విశ్వ షాకయ్యాడు. నేను అనలేదని.. కెమెరాలు కూడా చూస్తున్నాయని.. ఆ మాట అనలేదని చెప్పుకొచ్చాడు. మొత్తానికి రవి పరిస్థితి మాత్రం దారుణంగా ఉందనుకోవాలి. ఇతరుల గురించి మరో కంటెస్టెంట్ దగ్గర మాట్లాడిన మాటలు తనకే ఉచ్చుగా మారుతున్నాయి.