హుజూరాబాద్ ఉపఎన్నికల తేదీని ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 30 న ఎన్నికలు…నవంబర్ 2న ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్, బిజెపిలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. ఎన్నికల్లో పోటీకి దిగుతున్న తమ అభ్యర్థులను సైతం ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా జోరుగా జరుపుతున్నాయి. టీఆర్ఎస్ నుండి ట్రబుల్ షూటర్ హరీష్ రావు విస్తృత స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈటెల పై విమర్శలు కురిపిస్తున్నారు. ఈటెల కూడా తన పార్టీలోని కీలక నేతలను రంగంలోకి దింపి ప్రచారం చేస్తున్నారు.
అయితే ముందు నుండి సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల తేదీ ప్రకటించడం తో ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించే సమయం ఆసన్నమైంది. అయితే ప్రస్తుతం హైకమాండ్ పరిశీలన లో హుజూరాబాద్ అభ్యర్థి ఎంపిక ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా రేపు అభ్యర్థి ఎవరన్నదానిపై అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా మాణిక్యం టాకూర్ ఎల్లుండి రాష్ట్రానికి వచ్చి నేతలకు దిశా నిర్దేశం చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.