బిగ్ బాస్ 6: మొదటివారం నామినేషన్ లో ఎవరెవరున్నారో తెలుసా..?

-

తాజాగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ ఎట్టకేలకు సెప్టెంబర్ 4 స్టార్ మా చానల్లో సాయంత్రం 6 గంటలకు ప్రసారమైన విషయం తెలిసిందే. ఇక దీంతో ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయారు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా 21 మంది కంటెస్టెంట్లు ఈసారి పూర్తిస్థాయిలో వినోదాన్ని పంచనున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం ప్రసారం అయ్యి మూడు రోజులు అవుతున్నా కూడా నామినేషన్ కి సంబంధించిన ఎటువంటి విషయాన్ని బయటకు తీసుకురాలేదు. ముఖ్యంగా దీనికి కారణం హౌస్ మేట్స్ ఆడుతున్న టాస్క్ అని చెప్పవచ్చు. ట్రాష్ లో ఇంటి సభ్యులు ఒక్కొక్కరు తమ స్థానాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే చాలెంజ్లో భాగంగా ఇప్పటికే క్లాసులో ఉన్న శ్రీహాన్ మాస్ లోకి , ట్రాష్ లో ఉన్న గీతు క్లాస్ లోకి వెళ్ళిపోయారు.

అలాగే ట్రాష్ లోకి అభినయశ్రీ , బాలాదిత్య వచ్చారు. ఇక ఫస్ట్ నుంచి ట్రాష్ లోనే ఉన్న ఇనయ గేమ్ పూర్తయినా కూడా ట్రాష్ లోనే ఉండిపోయింది. దీంతో ఈ వారం నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. అందుకున్న సమాచారం ప్రకారం ఈ వారం నామినేషన్ లో ట్రాన్స్ లో ఉన్న ముగ్గురితోపాటు, మాస్ లో ఉన్న మరి కొంతమంది కూడా నామినేట్ అయినట్లుగా సమాచారం. మొదటి వారంలో మొత్తం 7 మంది నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక వారిలో ముఖ్యంగా అభినయశ్రీ, ఇనాయా సుల్తానా, రేవంత్ , ఫైమా, ఆరోహి రావు, శ్రీ సత్య , చంటి ఉన్నట్లు సమాచారం.

మరి ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి బుధవారం నైట్ అవుతుంది. కాబట్టి ఈ పార్టిసిపెంట్స్ కి ఓటు వేసేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ముఖ్యంగా గురువారం, శుక్రవారం వచ్చే ఓటింగ్ ను బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆధారపడి ఉంటుంది. గీతూ రాయల్, ఆదిరెడ్డి ఇద్దరు కూడా ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారని చెప్పవచ్చు. ఈ ఏడుగురిలో మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news