బిగ్ బాస్ 6: రేవంత్ జర్నీ వీడియోతో ఫాన్స్ లో కలకలం..!

-

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 పై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అది ఒక చెత్త షో అంటూ అందరూ తిట్టిపోస్తున్నారు మరీ ముఖ్యంగా ఇప్పుడు ఫైనల్ వీక్ లో కూడా ఎలిమినేషన్ పెట్టి బాంబు పేల్చారు హోస్ట్ నాగార్జున. ఎలాగో ఈ ఆదివారం విన్నర్ ని ప్రకటించబోతున్నారు మరి ఈ సమయంలో ఎలిమినేషన్స్ అవసరమా అంటూ కూడా ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఇనయ ఎలిమినేషన్ తర్వాత శ్రీ సత్య, కీర్తి ,శ్రీహాన్, ఆదిరెడ్డి , రేవంత్ , రోహిత్ ఇలా ఆరుగురు గ్రాండ్ ఫినాలే వీక్ కి వెళ్లారు. అయితే ఆ ఆరుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నారు.

ఇకపోతే ఫినాలే కి వెళ్ళిన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కి సంబంధించి జర్నీ వీడియోలు వేస్తూ ఉంటారు. అయితే మొదటిగా రేవంత్ వీడియో వేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. సాధారణంగా గ్రాండ్ ఫినాలే కి వెళ్ళిన కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలను లాస్ట్ నుంచి ఫస్ట్ కి వేస్తూ ఉంటారు. అలాంటిది రేవంత్ వీడియోను ఫస్ట్ లోనే చూపించడంతో మిడ్ వీక్ లో రేవంత్ ని పంపేందుకు సన్న హాలు చేస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇనయ ఎలిమినేట్ అవుతుందని ఎవరు ఊహించలేదు.. కానీ ఆమెను ఎలిమినేట్ చేశారు. గతంలో గీతూ, బాలాదిత్యా ను కూడా ఇలాగే అకారణంగా పంపించారు. అంతకు ముందు సీజన్ లలో యాంకర్ రవిని కూడా అకారణంగా హౌస్ నుంచి వెళ్లగొట్టారు.

దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకుల ఓటింగ్ ను బిగ్ బాస్ పట్టించుకోవడం లేదు అని తప్పక ఒప్పుకోవాల్సిన నిజం.. నాగార్జున ప్రేక్షకుల ఓటింగ్ తోనే జరుగుతుందని అబద్ధాలు ఆడినా ఓట్లు వేస్తున్న జనానికి తెలియదా? ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయో ? ఆడియన్స్ కంటే గొప్ప జడ్జ్ ఎవరంటారు.. విన్నర్ అవుతాడు అనుకున్న రేవంత్ ని ఏం చేస్తారో అంటూ మరి కొంతమంది ఆగ్రహం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news