బిగ్ బాస్ దివి : ఇష్టం ఉండి కమిట్ అయితే మీకేం నష్టం..!!

-

తెలుగు సినిమా  అవకాశాల కోసం అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా అమ్మాయిల కు  అవకాశం రావాలంటే తప్పనిసరిగా ఆ సినిమా ముఖ్యుల తో పడకను పంచుకోవలసిందే. ముందు సినిమా ఛాన్స్ ఇస్తాము అని పిలుస్తారు, తర్వాత స్టొరీ డిస్కస్ చేయడం కోసం ఫామ్ హౌస్ కి రమ్మంటారు. అక్కడకి వెళ్లిన తర్వాత తమ నిజస్వరూపం బయట పెడతారు. అక్కడ కొంత మంది తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోవలసి వస్తుంది. కొంత మంది మాత్రం ఇష్టం లేదని మొహం మీద చెప్పేసి వస్తుంటారు.

రీసెంట్ గా ఈ విషయం మీద  గత బిగ్ బాస్  సీజన్లో కంటెస్టెంట్  గుర్తింపు పొందిన దివి  ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె తాజాగా రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో మంచి కారెక్టర్ చేసింది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో  వుండే కమిట్మెంట్  గురించి కుండ బద్దలు కొట్టినట్లు గా తన అభిప్రాయాలను తెలిపింది.

కమిట్మెంట్ అనేది అందరికి తెలిసిన విషయమే అని, మమ్ముల్ని అడగలేదని ఎవరైనా అంటే అది పెద్ద అబద్ధం అని తెలిపింది. ఈ కాస్టింగ్ కౌచ్ విషయం ఒక్కోరు ఒక్కో విధంగా వుంటారని, కొందరికి కెరియర్ లో ఎదగాలి అని వుంటుంది వాళ్ళు అడగ్గానే లోంగిపోతారు. మరి కొందరు  ఆ పని చేయటానికి మనసొప్పక సున్నితంగా వద్దని చెబుతారు. ఆమెకు ఇష్టం ఉండి కమిట్ అయితే అది తన దృష్టిలో అది పెద్ద తప్పు కాదని ఈమె వెల్లడించారు. ఇష్టం లేకపోయినా బలవంతం పెట్టడం పెద్ద తప్పు అంటూ వ్యాఖ్యానించింది. అలాగే నాకు మంచి కారెక్టర్ ఇస్తే డబ్బులు కూడా అడగనని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news