బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరూ నటించకూడదని, ఒకవేళ ఎవరైనా నటిస్తే జనం చెప్పుతో కొడతారని కూడా హేమ వ్యాఖ్యానించింది. ఇక తనను హౌస్ నుంచి బయటకు పంపాలనుకున్న వారు ఇప్పుడు ఎలిమినేషన్‌లో ఉన్నారని ఆమె చెప్పింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 హాట్ హాట్‌గా సాగుతోంది. తొలివారంలో నటి హేమ ఎలిమినేట్ అయి మూడు రోజులు అవుతోంది. ఈ క్రమంలో ఈ వారంలో ఎలిమినేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక రెండో వారంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నటి హేమ హౌస్ నుంచి బయటకు వచ్చి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఆ సమావేశంలో హేమ ఏమేం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందామా..!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 తొలివారంలోనే ఎలిమినేట్ అయిన హేమ మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. తనకు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రెబల్, నవ్వుల హేమ అనే టైటిల్స్ ఉన్నాయని, అయితే అవి రెండూ తనకు చాలని, కొత్తగా తనకు కాంట్రవర్సీ అనే టైటిల్ అవసరం లేదని ఆమె తెలిపింది. బిగ్‌బాస్ హౌస్‌లో తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. అయినా తనను ఎలిమినేట్ చేయడం బాధగా ఉందని ఆమె తెలిపింది. ఇక గూగుల్ ఓట్ల శాతంలో తాను ముందే ఉన్నా.. ఈసారి హాట్‌స్టార్ ద్వారా ఓట్లను లెక్కించారు కనుక.. తన అభిమానులకు అందులో తనకు ఎలా ఓటు వేయాలో తెలియలేదని, అందుకే తనకు ఓట్లు తక్కువ రావడంతో ఎలిమినేట్ అయ్యానని హేమ చెప్పుకొచ్చింది.
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరూ నటించకూడదని, ఒకవేళ ఎవరైనా నటిస్తే జనం చెప్పుతో కొడతారని కూడా హేమ వ్యాఖ్యానించింది. ఇక తనను హౌస్ నుంచి బయటకు పంపాలనుకున్న వారు ఇప్పుడు ఎలిమినేషన్‌లో ఉన్నారని ఆమె చెప్పింది. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు తాను వంట ఎలా చేయాలో హౌస్ మేట్లకు చెప్పానని, అలా చెప్పడం తప్పైందని ఆమె వాపోయింది. బాబా భాస్కర్ తాను మంచివాడినని చెప్పుకుంటూ నటిస్తునానడని, జాఫర్ తాను జర్నలిస్ట్ అనే భావనలో ఉన్నాడని, శ్రీముఖి లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడి అందరినీ ప్రభావితం చేస్తుందని హేమ తెలిపింది. ఇక హిమజ కూడా అదే బాపతుకు చెందుతుందని, అలీ ప్లేయర్ అని, రాహుల్ కప్పులు కడగడని హేమ తెలిపింది.
బిగ్‌బాస్ హౌస్‌లో అషు రెడ్డి కొన్ని రోజులు ఉండాలని తాను కోరుకుంటున్నానని హేమ చెప్పుకొచ్చింది. తాను హౌస్‌లో ఏమీ నేర్చుకోకుండానే బయటకు వచ్చానని, తనకు మళ్లీ హౌస్‌లోకి వెళ్లే ఆఫర్ వస్తే కచ్చితంగా వెళ్తానని హేమ స్పష్టం చేసింది. ఇక షోను హోస్ట్ చేస్తున్న నాగార్జున నచ్చారని, అలాగే ఆడిషన్స్ సందర్భంగా నిర్వాహకులు తనను ఇబ్బందులు పెట్టేలా ప్రశ్నలు అడగలేదని హేమ తెలిపింది. అయితే తనను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమని బిగ్‌బాస్ నిర్వాహకులు కోరారని తెలిపింది. ఒకవేళ తాను ప్రెగ్నెంట్ అయితే.. మూడు నెలలు అక్కడ ఉండడం ఇబ్బంది అవుతుంది కదా.. అందుకని వాళ్లు ఆ టెస్టు చేయించుకోమని కోరడంలో తప్పేమీ లేదని హేమ అభిప్రాయపడింది.
ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగానే తనను ఒక రోజు కిడ్నాప్ చేసినంత పని చేశారని, తరువాతి ఎపిసోడ్ ప్రసారం అయ్యాకే తనను బయటకు వదిలారని హేమ తెలిపింది. అయితే హేమ ఈ సమావేశం పెట్టి మరీ ఆ వివరాలను వెల్లడించడం వెనుక కారణం ఏమిటో ఇప్పటికీ జనాలకు అర్థం కాలేదు. ఎందుకంటే అసలు బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఎవరూ గతంలో ఇలా ప్రెస్ మీట్లు పెట్టలేదు. పలు న్యూస్ చానల్స్ ముందుకు వచ్చి బిగ్‌బాస్‌లో తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. కానీ హేమ అలా కాకుండా ఇలా మీడియా సమావేశం నిర్వహించడం వెనుక ఆంతర్యమేమిటా.. అని ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు..!