Bigg Boss 5 Telugu: హమీదా ఎలిమినేట్.. అందరి కంటే ఎక్కువ బాధ‌ప‌డింది అత‌డేనా!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో సండే ఫండే మారింది. దసరా పండుగ సందర్భంగా.. హౌస్ లో నవరాత్రుల ఉత్సవాలు ఎంత ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. అనంత‌రం హౌస్‌మేట్స్ అంద‌రూ దుర్గాదేవి పూజా చేసారు. పండుగ సందర్భంగా ఇంటి సభ్యులకు నాగార్జున స్పెషల్ గిఫ్ట్‌లు ఇచ్చాడు. న‌వ‌రాత్రుల స్పెష‌ల్ గా తొమ్మిది ఆటలు, తొమ్మిది బహుమతులు అంటూ ఇంటి సభ్యులకు ఫ్యామిలీ మెంబర్స్ వీడియోలను చూపించాడు. చాలా సంతోషంగా సండే గ‌డిసిందే అనుకునే లోపే.. అనూహ్యంగా హమీదను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.

నిజానికి ఐదో వారం ఎలిమినేష‌న్‌లో తొమ్మిది మంది నామినేట్ కాగా.. అందులో ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. అందులో లోబో, విశ్వ, ఇంకా హమీదాలు ఉన్నారు. అస‌లు.. హమీదా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేద‌ని అనుకున్నారు. ఆమె శ్రీరామ్ తో లవ్ ట్రాక్ న‌డుస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. సో ఇంకో రెండు , మూడు వారాలు ఆమె సెఫ్ జోన్లో ఉంది. అంద‌రూ భావించారు. అందుకే విశ్వ లేదా లోబోల్లో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చని కూడా ఊహించారు. కానీ, అనూహ్యంగా హమీదాని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌కు షాకింగ్ ఇచ్చారు.

హమీదా విష‌యానికి వ‌స్తే.. ఆమె చాలా ఇంట్రావ‌ర్ట్ .. గేమ్స్‌లోనూ ఆమె పార్టిసిపేయ‌న్ చాలా త‌క్కువ‌. ఎగ్రెసివ్ గా పెర్ఫామెన్స్ కూడా లేదు. ఇత‌ర స‌భ్యుల‌తో..ఎక్కువ కలిసిపోదు. కానీ, శ్రీరామ్ చంద్రకి మాత్రం ఫేవర్ గా ఉండేది. వీరిద్ద‌రి మ‌ధ్య చాలానే న‌డిసాయనేది టాక్‌. మిడనైట్ ప్లయింగ్ కిస్స్ లు ఇచ్చుకోవడం, శ్రీరామ్ – హమీదాలు ఒకరికొకరు ఫేవర్ గా గేమ్ ఆడటం అనేది. దీంతో ఇంటి స‌భ్యుల్లో ఈమె పై వ్య‌తిరేక పెరిగింది.

మ‌రోవైపు .. బిగ్ బాస్ కి వచ్చేవరకూ హమీదా ఎవరో? ఎవరికీ తెలీదు? కేవలం సాహసం చేయరా ఢింబకా అనే ఒకే ఒక సినిమా తెలుగులో చేసింది. ఆమె కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా త‌క్కువ‌. ఇవే ఆమెకు మైన‌స్ అయ్యింది. ఎలిమినేట్ అయ్యి బయ‌ట‌కు వ‌చ్చింది. అనంత‌రం నాగ్ ను క‌లిసి.. హ‌మీదా .. ఒక్కొక్కరికి త‌న అభిప్రాయాన్ని తెలిపింది.

ముందుగా మానస్ మంచోడే.. కానీ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్ప‌డం చాలా క‌ష్టమ‌ని చెప్పింది. ఇక ఆ తర్వాత కాజల్ ఫేక్ అని, ఆమె బంధాలకు విలువ ఇవ్వదని అస‌లు విష‌యాన్ని బ‌య‌ట పెట్టింది. హమీద తెలిపింది. ఇక జెస్సీతో ఫ్రెండ్ షిప్ లేదని తెలిపింది. సిరి మొద‌ట్లో బాగానే ఉన్నా.. ఈ మధ్య‌ అటూ ఇటూ ఫ్లిప్ అవుతుందని తెలిపింది. ఇక‌ ప్రియాంక.. ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో అస‌లు అర్థం కాదని తెలిపింది.

ఇక ప్రియ తన ఫెవరేట్ అని.. కానీ తను కెప్టెన్ కాకుండా చేశాననే ఆ .. గిల్టీ ఫీలింగ్ ఉందని.. కానీ వారంలో పోయిందని చెప్పుకొచ్చింది. ఇక.. ఆనీ మాస్టర్ .. త‌న ఫేవ‌రేట్.. చాలా మంచివారు. త‌న అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్తుంటానని తెలిపింది. ఎప్పుడూ నవ్విస్తుంటాడు సన్నీ..చాలా మంచివాడని తెలిపింది. నా వరకు రవి అన్నయ్య చాలా మంచోడు. నాకు ఎప్పుడూ తోడుగా ఉండేవాడని తెలిపింది. లోబో, శ్రీరామ్ మంచివాళ్లని చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ హౌస్‌లో బాండింగ్స్ కామనే. అలా హమీదా, శ్రీరామచంద్ర చాలా దగ్గరయ్యారు. వీరిద్దరు లవ్ బర్డ్స్ అంటూ ప్రేక్షకులు పుకార్లు కూడా మొదలుపెట్టేసారు. అయితే హమీదా ఎలిమినేట్ అవ్వడం తట్టుకోలేని శ్రీరామ్ తనను పట్టుకుని బాగా ఏడ్చేసాడు. కానీ హమీదా మాత్రం తాను చాలా తృప్తిగానే హౌస్ నుండి వెళ్తున్నట్టు వెల్లడించింది.