బిగ్‌బాస్:  ఈ వారం ఎలిమినేష‌న్‌పై ట్విస్ట్‌

-

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు వ‌చ్చేసింది. ఈ వారం ఎలిమినేష‌న్లో భాగంగా ఇంటి నుంచి ఒక స‌భ్యుడు బ‌య‌ట‌కు వెళ్ల‌నున్నాడు. మిగిలిన ఐదుగురి మ‌ధ్య బిగ్‌బాస్ ట్రోఫీ కోసం పోరు జ‌రుగుతుంది. ఇక ఇప్ప‌టికే రాహుల్ సిప్లింగంజ్ డైరెక్టుగా టిక్కెట్ టు ఫినాలేకు చేరుకున్నాడు. మిగిలిన ఐదుగురిలో కూడా బిగ్‌బాస్ షాక్ ఇస్తూ బాబా భాస్క‌ర్‌ను సేవ్ చేశాడు.

ఇక ఇప్పుడు వరుణ్, శ్రీముఖి, శివ జ్యోతి, అలీ ఇంకా ఎలిమినేష‌న్ జోన్లో ఉన్నారు. వీరిలో శ్రీముఖి ఖ‌చ్చితంగా సేవ్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మిగిలిన ముగ్గురిలో ముందు నుంచి శివ‌జ్యోతి, ఆలీల‌లో ఎవ‌రో ఒక‌రు బ‌య‌ట‌కు వెళ‌తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే చివ‌ర్లో వ‌రుణ్ తీరు చాలా మందికి న‌చ్చ‌క‌పోవ‌డంతో పాటు త‌న భార్య వితిక‌ను చివ‌రి వ‌ర‌కు హౌస్‌లో ఉంచాల‌న్న తాప‌త్ర‌యంతో చేసిన ప‌నితో అత‌డు చాలా మంది న్యూట్ర‌ల్ ఓట‌ర్ల‌కు దూర‌మ‌య్యాడు.

ఇక ఈ వారం శివ‌జ్యోతి ఎలిమినేట్ అవుతుంద‌ని కొంద‌రు… ఆలీ ఎలిమినేట్ అవుతాడ‌ని కొంద‌రు అంచ‌నా వేశారు. అయితే అనూహ్యంగా శివ‌జ్యోతి ఇప్పుడు ఓట్ల‌లో దూసుకు రావ‌డంతో పాటు ఆలీ బాగా వెన‌క‌ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే శివ‌జ్యోతి చివ‌ర్లో వ‌రుణ్‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆమె వ‌రుణ్ ఓట్ల శాతానికి ద‌గ్గ‌ర‌గా వెళ్లిన‌ట్టు కూడా బిగ్‌బాస్ లీకు వీరులు చెపుతున్నారు.

ఇక ఆదివారం దీపావ‌ళి కావ‌డంతో శ‌నివార‌మే ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని తెలుస్తోంది. చివ‌ర్లో మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో శివ‌జ్యోతి సేవ్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఇక మిగిలింది వ‌రుణ్, ఆలీ రెజాల‌లో మ‌రి ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news