నిఖిల్ ‘అర్జున్ సురవరం` రిలీజ్ డేట్ ఫిక్స్‌..

-

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా టి.సంతోష్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా ‘అర్జున్ సురవరం’. వాస్త‌వానికి మార్చి లోనే విడుద‌ల కావ‌ల‌సి ఉన్న ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. ముద్ర అనే టైటిల్‌ని ముందుగా ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. కాని అదే పేరుతో జ‌గ‌ప‌తి బాబు చిత్రం విడుద‌ల కావ‌డంతో పేరు మార్చి అర్జున్ సుర‌వ‌రం పేరుతో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. నవంబర్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల కోసం నిఖిల్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news