బిగ్ బాస్ టైమింగ్ లో మార్పు.. కారణం అదేనా..?

-

తెలుగు టెలివిజన్లో అత్యంత పాపులార్ అనిపించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ చివరి దశకి వచ్చేసింది. ఐతే షో పూర్తవడానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో బిగ్ బాస్ యాజమాన్యం విఫలమవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో టైమ్ లో మార్పు చేస్తున్నారని తెలుస్తుంది. ప్రతి రోజూ 9:30గంటలకి మొదలయ్యే షో, వచ్చే వారం నుండి 10గంటకి మొదలవనుంది. ఐతే శని ఆదివారాల్లో మాత్రం రెగ్యులర్ టైమ్ కే మొదలవుతుందట.

స్టార్ మా లో కొత్త సీరియల్ గుప్పెడంత మనసు మొదలవడంతో బిగ్ బాస్ టైమింగ్ లో మార్పు వచ్చింది. గుప్పెడంత మనసు సాయంత్రం 7గంటలకి ప్రసారం కానుంది. ఆ స్లాట్ లో ఆల్రెడీ రన్ అవుతున్న వదినమ్మ 9:30గంటలకి ప్రసారం చేస్తున్నారు. ఐతే సీరియల్ కోసం రియాలిటీ షో టైమింగ్ ని మార్చాల్సి రావడం విడ్డూరమే. టీఆర్పీలు తగ్గడం వల్లే ఈ విధంగా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. 9:30కి మొదలైతే అంతంతమాత్రం టీఆర్పీలు వస్తుంటే, 10గంటలకి ఆ మాత్రమైనా వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news