అక్క‌డ ఇంటిని కొంటారా ? ధ‌ర కేవ‌లం రూ.88 మాత్ర‌మే..!

-

ఎప్ప‌టికైనా సొంత ఇంట్లో నివాసం ఉండాల‌ని చాలా మంది క‌ల‌లు కంటుంటారు. అందుక‌నే తీవ్రంగా శ్ర‌మిస్తుంటారు. ప్ర‌స్తుత త‌రుణంలో ఇల్లు కొనాల‌న్నా లేదా స్థ‌లం కొని ఇల్లు క‌ట్టించుకోవాల‌న్నా.. రూ.ల‌క్ష‌లు మొద‌లుకొని రూ.కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి స్థోమ‌త‌కు త‌గిన‌ట్లువారు ఇళ్ల‌ను కొన‌డ‌మో, క‌ట్టించుకోవ‌డ‌మో చేస్తుంటారు. అయితే ఇళ్ల‌ను కొనే విష‌యానికి వ‌స్తే అక్క‌డ మీకు కేవ‌లం రూ.88కే ఇల్లు దొరుకుతుంది. అవును.. మీరు విన్నది నిజ‌మే.

you can buy a house for rs 88 only at this town

ఇట‌లీలోని మోలిసె ప్రాంతంలో కాస్ట్రోపిగ్నానో అనే టౌన్ ఉంది. అక్క‌డ మొత్తం 923 జనాభా ఉంటుంది. ఒక బార్, ఒక రెస్టారెంట్ ఆ టౌన్‌లో ఉన్నాయి. అక్క‌డ 14వ శ‌తాబ్దానికి చెందిన ఓ కోట కూడా ఉంది. అందులో కొంద‌రు నివ‌సిస్తుంటారు. అయితే ఆ టౌన్‌లోని జ‌నాలు అక్క‌డ నివాసం ఉండ‌డం నెమ్మ‌దిగా మానేస్తున్నారు. దీంతో అక్క‌డ ఖాళీగా ఉండే ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. మ‌రోవైపు ఆ టౌన్‌కు చారిత్ర‌క నేప‌థ్యం కూడా ఉంది. దీంతో ఆ టౌన్‌లో ఎలాగైనా జ‌నాల‌ను నింపాల‌నే ఉద్దేశంతో ఇట‌లీ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. అక్క‌డ ఖాళీగా ఉన్న ఒక్కో ఇల్లును కేవ‌లం రూ.88.87 కే అమ్ముతోంది. దీంతో జ‌నాలు మ‌ళ్లీ ఆ టౌన్‌కు వ‌చ్చి అక్క‌డ స్థిర ప‌డుతారని ఆలోచ‌న.

అయితే అంత మొత్తం పెట్టి కొనుగోలు చేసినా ఇళ్ల‌ను రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదా పూర్తిగా కూల్చి కొత్త ఇల్లు క‌ట్టుకోవ‌చ్చు. ఇంట్లోనే ఏదైనా షాప్‌, రెస్టారెంట్ వంటివి పెట్టుకోవ‌చ్చు. ఆ ప్రాంతాన్ని టూరిస్టు ప్ర‌దేశంగా మార్చాల‌ని ఆ దేశ ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుక‌నే ఈ ఆఫ‌ర్‌ను పెట్టారు. సహ‌జంగానే కొండ‌ల‌పై ఆ టౌన్ ఉంటుంది. స‌మీపంలో స‌ముద్రం ఉంటుంది. క‌నుక ప్ర‌కృతి అందాల‌కు ఆ ప్రాంతం నెల‌వుగా ఉంది. కానీ అక్క‌డి నుంచి జ‌నాలు వెళ్లిపోతుండ‌డం పాల‌కుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. అందుక‌నే అలా త‌క్కువ ధ‌ర‌కే ఇళ్ల‌ను అమ్ముతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news