బిగ్ బాస్-3 ఫేమ్ రవికృష్ణకి క‌రోనా..!

-

క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌త రెండున్నర నెల‌లుగా సినీ ఇండ‌స్ట్రీలో, టీవీ రంగంలో ఎలాంటి షూటింగ్‌ లు జ‌ర‌గ‌లేదు. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఈ మధ్యనే షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా కలకలం మొదలైంది. ఇప్పటికే ఇద్దరు టీవీ ఆర్టిస్టులకు హరిక్రిష్ణ, ప్రభాకర్‌ ‌లకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్‌లో పాల్గొన్న మిగతా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు బెంబేతెల్తిపోతున్నారు. తాజాగా బిగ్ ‌బాస్- 3 తో పాపుల‌ర్ అయిన ర‌వికృష్ణ క‌రోనా బారిన ప‌డ్డారు.

ప్ర‌స్తుతం తాను క్షేమంగానే ఉన్న‌ట్టు తెలిపారు ర‌వికృష్ణ. త‌న‌తో క‌లిసి ప‌ని చేసిన వారిని ప‌రీక్షించి ఆ త‌ర్వాత ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స అందించాల‌ని అభ్య‌ర్ధించారు. అయితే ఇటీవలే సీరియల్ నటి నవ్య స్వామి కూడా కరోనా బారిన పడి ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. నవ్య, రవికృష్ణ ఇద్దరు కలిసి ఆమె కధ సీరియల్‌లో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో వీరిద్దరూ ఇప్పుడు కరోనా బారిన పడటంతో.. మిగతా సీరియల్ యూనిట్ సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version