ఓటీటీ వెర్షన్ విషయంలో బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం.. ఏమైందంటే..?

-

బిగ్ బాస్.. రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్ లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. అయితే ఐదు ఆరు సీజన్లకు టిఆర్పి రేటింగ్ అనుకున్నంత రాకపోయినా అలా కొనసాగించేశారు. ఇదిలా ఉండగా ఐదవ సీజన్ పూర్తయిన తర్వాత హిందీలో బిగ్ బాస్ నిర్వాహకులు ఓటీటీ వెర్షన్ ప్రారంభించడంతో తెలుగులో కూడా దానిని లాంచ్ చేశారు. అలా తెలుగు ఓటీటీ వెర్షన్ గత ఏడాది ప్రీమియర్ అయింది. అయితే ఈ ఏడాది రెండవ సీజన్ కూడా ఉంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో బిగ్బాస్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ 6 టీవీలో ప్రసారం చేసి ఓటీటీ లో రిలీజ్ చేస్తేనే ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ సీజన్ 2, ఓ టీ టీ వెర్షన్ రిలీజ్ చేస్తే ఎంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఒకవేళ ప్రేక్షకులను కనెక్ట్ కాలేకపోతే డబ్బు అంతా వృధా అవుతుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే రెండో సీజన్ ఓటీటీ వర్షన్ చేయకూడదని బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . మరోవైపు బిగ్ బాస్ నిర్వహకుల తీరుతో విసిగిపోయిన నాగార్జున పూర్తిగా బిగ్ బాస్ షో నుంచి తప్పుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారట.

ఒకవైపు రానా తన అనారోగ్యం దృష్ట్యా ఆయన సినిమాలలో స్టంట్ లాంటివి చేయలేరు. కాబట్టి ఇంటికే పరిమితం అవ్వాలని భావిస్తున్నారట. కాబట్టి నా స్థానంలో రానాను తీసుకోండి అంటూ నాగార్జున బిగ్ బాస్ నిర్వాహకులకు సూచించినట్లు సమాచారం. మరోవైపు అన్ స్టాపబుల్ సీజన్ ల ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న బాలకృష్ణ ఈ బిగ్ బాస్ 7 సీజన్ కి హోస్టుగా అయితే బాగుంటుందని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news