బీహార్ సీఎం నితీషే.. ప్రకటించిన బీజేపీ

బీహార్ లో సీఎం ఎవరు ? అనే అంశం మీద క్లారిటీ వచ్చేసింది. బీహార్ సీఎంగా నితీశ్ కుమారే ఉంటారని ప్రకటించింది బీహార్ బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి తక్కువ ఓట్లు వచ్చినా మిత్రధర్మాన్ని పాటిస్తామని పేర్కొంది. స్వయంగా సుశీల్ కుమార్ మోడీ నితీశ్‌ పేరును ప్రకటించారు. ఇక ఈ ప్రకటనతో వరుసగా నాలుగోసారి నితీశ్‌ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

nitish
nitish

ఎన్నికల సమయంలోనూ నితీశ్‌ కుమార్ తమ సీఎం అభ్యర్థని బీజేపీ నేతలు ప్రకటిస్తూ వచ్చారు. ఐతే ఫలితాల్లో బీజేపీ, జేడీయూ కంటే ఆధిక్యత కనబర్చింది. దీంతో నితీశ్‌ కుమార్‌ను సీఎం చేస్తారా..? కొత్త వారికి అవకాశం ఇస్తారా..? లేక మోడీకి అధికారం అప్పగిస్తారా ? అన్న అనుమానాలు వచ్చాయి. రాజకీయ వర్గాల్లోనూ ఈ చర్చ విస్తృతంగా మొదలవ్వడంతో క్లారిటీ ఇచ్చారు సుశీల్ కుమార్‌. ఇందులో చర్చలు అక్కర్లేదని నితీషే బీహార్ సీఎం అని తేల్చి చెప్పారు.