బీహార్ లో ఎన్నికల ఫలితాల ట్రెండ్ మొదలయింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడినట్టు గానే ఆర్జేడీ 123 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్.ఎల్. ఏ లకు ఎరవేస్తారనే అనుమానంతో అప్రమత్తమయింది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. ఆర్.జే.డి నాయకత్వంలోని “మహా కూటమి”లో భాగస్వామ్య పక్షాలుగా కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఉన్నాయి. బీహార్ కు హుటాహుటిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులైన అవినాశ్ పాండే, రణదీప్ సింగ్ సూర్జేవాలాలు చేరుకున్నారు. మహా కూటమిలోని భాగస్వామ్య పక్షాల ఎమ్.ఎల్. ఏ లకు ప్రత్యర్ధి కూటమి ఎన్.డి.ఏ ఎర వేస్తుందన్న ఆందోళనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు కొద్ది పాటి తేడా ఉంటే మాత్రం, బీహార్ లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారనున్న్నాయని చెప్పాలి. అందరి అంచనాలు మాత్రం, 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ లో ఆర్.జే.డి “మహా కూటమి” 139 నుంచి 161 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉందని అంటున్నారు. నితీష్ కూటమి మాత్రం 69 నుంచి 91 అసెంబ్లీ స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందని వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.