నువ్వు సీఎం అవుతావ్… కొడుక్కి చెప్పిన లాలూ…!

-

పశుగ్రాసం కుంభకోణం కేసుల్లో రాంచీలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ సోమవారం తన చిన్న కుమారుడు తేజశ్వి యాదవ్ కి తన 31 వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ ఎన్నికల ఫలితాల్లో మంగళవారం నీకు బీహార్ ప్రజలు పుట్టిన రోజు కానుక ఇస్తారు అని ఆయన చెప్పడం గమనార్హం. తేజశ్వి యాదవ్‌ సిఎం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఆర్జేడీ నేతృత్వంలోని గ్రాండ్ అలయన్స్‌కు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ విజయం సాధిస్తాయని అంచనా వేసాయి.

అర్దరాత్రి 12 గంటల తర్వాత లాలూ ఫోన్ చేసినా సరే తేజస్వి నిద్రపోవడంతో మళ్ళీ ఉదయం ఆరు గంటలకు ఫోన్ చేసి విష్ చేసారు అని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. “తోహ్ఫా టు బీహార్ కి జంత కల్ దేగి (బీహార్ ప్రజలు రేపు మీకు పుట్టినరోజు కానుక ఇస్తారు)” అని లాలూ చెప్పారట.

Read more RELATED
Recommended to you

Latest news