బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కోవిడ్-19 అనంతరం దేశంలో తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒక్కో పోలింగ్ బూత్ లో గరిష్టంగా 1,000 ఓట్లు వేసేలాగా ఏర్పాటు చేసింది. అన్ని పోలింగ్ బూత్ లలో శానిటైజర్లు, పీపీఈ కిట్లు, ఇతర పరికరాలను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది.
బిహార్ ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు దాటినా 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు. మూడు దాటే సమయానికి కేవలం 46.2 మాత్రమే పోలింగ్ శాతం నమోదయింది. వోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మొహరించారు. అలానే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ జరగనుంది. ఇక ఇక అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు హెలీకాప్టర్లని కూడా సిద్ధంగా ఉంచింది.