నాని బెస్ట్ ఫ్రెండ్‌తో సినిమా చెయ్యడానికి రెడీ అయిపోయాడు. చాన్నాళ్లుగా చర్చల్లో ఉన్న సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఫ్రెండ్ డైరెక్షన్‌లో రొమాంటిక్ ఎంటర్టైనర్ చెయ్యబోతున్నాడు నాని. ఇంతకీ నేచురల్‌స్టార్‌ని డైరెక్ట్ చెయ్యబోతోన్న ఆ ఫ్రెండ్ ఎవరు అంటారా…నేచురల్ స్టార్ నాని, అవసరాల శ్రీనివాస్ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘అష్టా చమ్మా’ చిత్రంతో వీరిద్దరూ ఒకేసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
నాని హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు స్టార్ గా కూడా ఎదిగాడు. ఇక అవసరాల శ్రీనివాస్ విభిన్నమైన పాత్రలు చేస్తూ నటుడుగా కొనసాగుతున్నాడు. అంతేకాదు డైరెక్టర్ గా కూడా మారి రెండు డీసెంట్ హిట్ సినిమాలను కూడా అందించాడు. ‘ఊహలు గుసగుసలాడే’ ‘జ్యో అచ్యుతానంద’ వంటి చిత్రాలు అవసరాల దర్శకత్వ ప్రతిభ ఏంటనేది తెలియజేసాయి. ప్రస్తుతం నాగ శౌర్య తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అవసరాల. ఇది పూర్తయిన తరువాత నానితో సినిమా చేసే అవకాశం ఉందట. టక్ జగదీష్, శ్యామ్ సింగారాయ్ తో నాని కూడా బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది నాని, అవసరాల సినిమా లాంచింగ్ అయ్యే అవకాశం ఉంది.