బీజేపీ ప్రభుత్వానికి విషమపరీక్ష..నేడు 28సీట్లకు ఉప ఎన్నిక…!

-

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ భవితవ్యాన్ని తేల్చే అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 12 మంది మంత్రుల స్థానాలు సహా 28 చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 25 చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యనే ప్రధాన పోటీ. మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 114 స్థానాలను గెల్చుకుని కమల్‌నాథ్‌ అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అయితే, ఈ ఏడాది మార్చి నెలలో జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, 22 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఆయనవెంట వెళ్లడంతో సర్కారు పడిపోయింది. జ్యోతిరాదిత్య వర్గ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. తర్వాత మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరా రు. వీరు ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. ఉప ఎన్నిక ఫలితాలపై ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది. సాధారణ మెజారిటీకి 8 స్థానాలైనా గెలవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news