బిహార్: నితీశ్ కుమార్ అనే యువకుడు కొంతకాలంగా నోటిలో కణితితో బాధపడుతున్నారు. దీని బాధ తీవ్ర ఎక్కువగా ఉండటంతో వైద్యులు చికిత్స చేశారు. నోట్లోని దవడల భాగంలో ఏర్పడిన భారీ కణితిని తొలగించారు. ఈ సమయంలో మొత్తం 82 దంతాలను కూడా తొలగించాల్సి వచ్చింది. ఈ కణిత రెండు దవడల వైపు ఏర్పడటం వల్ల నితీశ్ కుమార్ ముఖం వికృతంగా కనిపించేది.
ఇప్పుడు సర్జరీ చేయడంతో యువకుడి ముఖం సాధారణ పరిస్థితిలోకి వచ్చింది. 3 గంటల పాటు శ్రమించి నితీశ్‌కు వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. మమూలుగా ప్రతి ఒక్కరికి 32 పళ్లు ఉంటాయి. కానీ నితీశ్‌కు 50 దంతాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆపరేషన్ వల్ల మొత్తం 82 దంతాలు తొలగించాల్సి వచ్చిందని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.