దుర్గ‌గుడి ఫ్లై ఓవ‌ర్ పై గ‌న్ తో హ‌ల్చ‌ల్..వీడియో వైర‌ల్..!

విజయవాడలో ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నా కూడా ఆక‌తాయిలు మాత్రం బ‌య‌ప‌డ‌కుండా రెచ్చిపోతున్నారు. ఇక‌ దుర్గగుడి ఫ్లై ఓవర్ పై తాజాగా ఆక‌తాయిలు ప్రమాదకర విన్యాసాలు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. బైక్ పై నిలబడి గన్ తో పైకి కాల్చుతూ ఆక‌తాయిలు ఫ్లై ఓవ‌ర్ పై హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఫోటో షూట్ పేరుతో యువ‌కులు విన్యాసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

రాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు చేస్తుండడంతో రోడ్డుపై వాహ‌న చోద‌కులు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. KTM , పల్సర్ 220 బైక్ ల నెంబర్ ప్లేట్లను తీసేసి ఆక‌తాయిలు రోడ్లపై విన్యాసాలు చేస్తున్నారు. దాంతో యువకులను గుర్తించే పనిలో బెజవాడ పోలీసులు ఉన్నారు. అంతే కాకుండా గన్ నకిలీదో ఒరిజినల్ దో పోలీసులు విచారిస్తున్నారు. ఇక స్థానికుల నుండి భారీగా ఫిర్యాదులు రావ‌డంతో విజ‌య‌వాడ పోలీసులు ఈ విషయాన్ని సీరియ‌స్ గా తీసుకుని విచారిస్తున్నారు.

https://www.instagram.com/tv/CUWzY4CA7nV/?utm_source=ig_web_copy_link