Bigg Boss Sarayu Breakup love Story: ఏడ్లేండ స‌హ‌జీవ‌నం..పెళ్లికి ముందే అన్నీ.. చివ‌రికి ఆ కార‌ణంతో పెళ్లి కాన్సిల్

-

Bigg Boss Sarayu Breakup love Story: స‌ర‌యు.. యూట్యూబ్ స్టార్.. రెగ్యులర్ గా యూట్యూబ్ ఫాలో అయ్యేవాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు. బోల్డ్ కంటెంట్‌తో వీడియోలు చేస్తూ చాలా పాపుల‌ర్ అయ్యింది. 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ తో చాలా ఫేమ‌స్ అయ్యింది. ఈ ఛాన‌ల్ లో బోల్డ్‌గా సినిమా రివ్యూలు, అడల్ట్ కామెడీ స్కిట్స్ లు చేస్తూ.. యూట్యూబ్ ల‌వ‌ర్స్ ను ఎంట‌ర్టైన్ చేస్తుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ స్టార్ గా ఎదిగింది స‌ర‌యూ.

ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ సీజన్ 5లో అడుగుపెట్టింది. బయటే త‌న బూతుల‌తో ధూమ్ ధామ్ చేసే సరయు.. బిగ్ బాస్ ఇంటిలో ఏవిధంగా ఆడుతుందో, త‌న ర‌ఫ్ యాటిట్యూడ్ తో బిగ్ బాస్ ల‌వ‌ర్స్ ని ఓ రేంజ్ లో ఎంట‌ర్టైన్ చేస్తున్న‌ద‌ని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా సరయు మొదటివారమే ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

హౌస్ నుండి బయటికి వచ్చాక షణ్ముఖ్ పై యాటిట్యూడ్ పై మండి ప‌డింది. ఆడితే మగాడిలా ఆడు, లేదంటే గాజులు వేసుకుని ఓ మూలన కూర్చో అంటూ సెన్సెష‌నల్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ కారణంగా షణ్ముఖ్ ఫ్యాన్స్ సరయుపై సోషల్ మీడియా దాడికి దిగారు. అయినా ఏ మాత్రం త‌గ్గ‌కుండా త‌న‌దైనా శైలిలో షణ్ముఖ్ ఫ్యాన్స్ కి కూడా వార్నింగ్ ఇచ్చారు.

కాగా.. తాజా ఓ ఇంటర్వ్యూలో సరయు మాట్లాడుతూ.. త‌న వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాలు వెల్లడించింది. ప్రేమ, పెళ్లి, రిలేషన్ షిప్ పై ఓపెన్ అయింది. త‌న జీవితంలోని టాప్ సీక్రెట్, ట్రాజిడీని బయలు పెట్టింది. సరయు మాట్లాడుతూ.. ఒక వ్యక్తితో ఏడేళ్లు లివింగ్‌ రిలేషన్ లో ఉన్నా.. ఆ విష‌యం మా ఇంట్లో కూడా తెలుసు.. ఆ అబ్బాయి ఇంట్లో వాళ్లకు తెలుసు. రిలేషన్ షిప్ ఉన్న స‌మ‌యంలో నా కెరీర్ ను టోట‌ల్ గా పక్కన పెట్టాను.

రిలేషన్‌లో అతడికి పూర్తిగా ఇచ్చేశాను. నేను వర్జిన్ కూడా కాదు.. మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ సెట్ కాలేదు. కట్నం ద‌గ్గ‌ర గొడ‌వ‌. దీంతో పీటల దాకా వచ్చిన పెళ్ళి కాన్సిల్ అయ్యింది. అబ్బాయి వాళ్లు .. ముందు పాతిక లక్షల క‌ట్నం అడిగారు.. ఆ తర్వాత అరకోటి కావాల‌న్నారు.. ఆ తర్వాత కోటి చేశారు.. ఆ త‌రువాత సగం ఆస్తి అడిగారు. ఇప్పడే ఇలా చేస్తే.. పెళ్లయ్యాక ఇంకెన్ని అడుగుతారో.. ఇంకెలా ప్ర‌వ‌ర్తిస్తారో అని నేను క్యాన్సిల్ చేశాను. నువ్వు నాకు తగినవాడివి కాదని, వాడి మొఖం మీద‌నే చెప్పేశాను అంటూ త‌న పెయిన్ పుల్ బ్రేక‌ఫ్ ల‌వ్ స్టోరీని చెప్పుకొచ్చింది సరయు.

Read more RELATED
Recommended to you

Latest news