పవన్ కళ్యాణ్ పై మంచు విష్ణు సెటైర్లు…మా వెనుక జగన్‌ !

పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ కోసం మాట్లాడిన మాటలు తాను ఏకిభ వించటం లేదని…పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై నాన్న గారు మాట్లాడతారని మంచు విష్ణు అన్నారు. మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు మంచు విష్ణు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ రోజు మా ఎన్నికల్లో మా ప్యానెల్ సభ్యులం అందరం నామినేషన్లు వేసామని… 10న ఎన్నికలు జరుగుతాయన్నారు.

తాము గెలుస్తాం ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నామని… ప్రతి తెలుగు నటుల ఆత్మ గౌరవ పోరాటం ఇది అని తెలిపారు. తమ వెనుక జగన్ వున్నారని మీడియానే రాస్తుందని… తనకు 900 మంది సభ్యుల మద్దతు వుందన్నారు.

తన మానిఫెస్టో చూసిన తరువాత చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేస్తారన్నారు. తాము తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైపు ఉన్నమని తెలిపారు మంచు విష్ణు. తాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వున్నానని.. ఛాంబర్ తీసుకున్న స్టాండ్ కు తాము కట్టు బడి వున్నామని స్పష్టం చేశారు. మరి ప్రకాష్ రాజ్ గారు ఎవరి వైపు వున్నారో చెప్పాలని ప్రశ్నించారు.