మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంతో పంజాబ్‌కు చెందిన 32 రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది చారిత్రాత్మక రోజుగా అభివర్ణించిన రైతు నాయకులు, రైతుల విజయంగా ప్రకటించారు. పోరాటంలో మేం విజయం సాధించామని బీకేయూ అధ్యక్షుడు బుటా సింగ్ బుర్జిల్ తెలిపారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇదే అతి పెద్ద ఆందోళన, ఉద్యమం మొత్తం శాంతియుతంగా సాగిందని అని బుటా సింగ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. ఇది రైతుల విజయమని, వచ్చే నెల 1న సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో ఆందోళన విరమణపై నిర్ణయం తీసుకుంటామని బీకేయూ (కడియన్) అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కడియన్ తెలిపారు.