కేప్‌టౌన్‌లో నెగెటివ్ ఢిల్లీలో పాజిటివ్.. 72 గంటల్లో వేర్వేరు ఫలితాలు

-

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుడి మూడు రోజుల వ్యవధిలో నిర్వహించిన రెండు కొవిడ్ టెస్టుల్లో విభిన్న ఫలితాలు రావడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. అతడితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న వ్యక్తులను కనుగొనే పనిలో పడ్డారు. మహారాష్ట్ర డొంబివిలికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 24న దక్షిణాఫ్రికా నుంచి న్యూఢిల్లీకి చేరుకున్నాడు. ఆ సమయంలో ఆర్‌టీపీసీఆర్ టెస్టు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అయితే, 72 గంటల ముందు కేప్‌టౌన్‌‌లో నిర్వహించిన టెస్టులో నెగిటివ్ ఫలితం రావడం గమనార్హం.

కొత్త వేరియంట్ ఒమైక్రాన్ భయందోళనల నేపథ్యంలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అలర్ట్ అయింది. ఫ్లైట్‌లో అతడితో సామీప్యంగా ఉన్న ప్రయాణికులతోపాటు ముంబయి నుంచి డొంబివిలి తీసుకువచ్చిన క్యాబ్ డ్రైవర్, తోటి ప్రయణికుల ఆచూకీ కనుగొనే పనిలో పడింది. కేప్‌టౌన్‌లో నిర్వహించిన కొవిడ్ టెస్టులో నెగెటివ్ ఫలితం తప్పుగా వచ్చి ఉండవచ్చని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రతిభా పాన్పాటిల్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news