“బీజేపీ – జనసేన” ఉమ్మడి ఎన్నికల ప్రచారం …!

తెలంగాణాలో ఎన్నికలకు ఇక 10 రోజులు మాత్రమే సమయం ఉంది. అందుకే అన్ని ముఖ్య పార్టీలు ప్రచారంలో జోరును మరింతగా పెంచాయి. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో బీజేపీ మరియు జనసేనలు కలిస్ పోటీ చేస్తున్న సమయంలో కలిసే ప్రచారాలలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో వరంగల్ లో జరగనున్న ప్రచార సభకు స్థానిక నేతలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఇక నవంబర్ 26న కేంద్రమంత్రి అమిత్ షా తో కలిసి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఇక తెలంగాణాలో బీజేపీ రేపు జునిలీ హిల్స్ లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముషీరాబాద్ లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ లు రోడ్ షో లు నిర్వహిస్తారు.

ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులు వరుసగా 25 , 26 ,27 తేదీలలో మొత్తం 6 సభలలో పాల్గొనబోతున్నారు. మరి ఈ పది రోజుల్లో తెలంగాణ ప్రజల మనసును మార్చే పార్టీనే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి