ఓట్ల కోసం వస్తున్న ఆ పార్టీ నేతలను అక్క, చెల్లెళ్లు చీపురు కట్టలతో తరిమికొట్టాలి : మంత్రి హరీశ్ రావు

నాలుగు వందలు గ్యాస్‌ సిలిండర్‌ను వెయ్యి చేసింది పువ్వు గుర్తొడు. పాల మీద జీఎస్టీ వేసింది పువ్వు గుర్తోడు. బాయికాడ, బోరుకాడ మీటర్ పెట్టాలంటున్నది పువ్వు గుర్తోడు. మీ ఇంటికి కాడికి బిల్లు పంపు అంటున్నది పువ్వు గుర్తోడు. ఏం ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్లు ఓట్లు వేయాలని ఊర్లలో తిరుగుతున్నరని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆ పార్టీ నేతలపై ఫైర్‌ అయ్యారు. సోమవారం గజ్వేల్‌ పట్టణంలో సీఎం కేసీఆర్‌కు మద్దీతుగా నిర్వహించిన రోడ్‌ షో లో మంత్రి పాల్గొని మాట్లాడారు.

నిత్యావసర వస్తువలపై సమాన్యుడు భరించలేనంగా రేట్లు పెంచి సిగ్గులేకుండా ఓట్ల కోసం వస్తున్న బీజేపోళ్లను అక్క, చెల్లెళ్లు చీపురు కట్టలు పట్టుకొని తరమాలని పిలుపునిచ్చారు. అప్పుడన్నా వాళ్లకు సిగ్గు వస్తుందన్నారు. ఎన్నికల సమయంలో అందరూ వస్తుంటారు పోతుంటారు. లేని పోనివి చెబుతుంటారు. ప్రజలు ఆలోచన చేయాలి. ఓటు అంటే మూడోద్దుల మురిపం కాదు. ఐదేళ్ల భవిత. భవిష్యత్తు అన్నారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో గజ్వేల్ ఎంత అభివృద్ది చెందింది. చుక్క నీళ్ళ లేని గజ్వేల్ ను, నీళ్ల గజ్వేల్ లాగా చేసింది కేసీఆర్. బోరు నీళ్ల గజ్వేల్ గోదావరి నీళ్ల గజ్వేల్ చేశారన్నారు. సాగు నీళ్ళ కష్టం తీరి, రెండు పంటలు పండుతున్నాయి. నాడు కైకిలు దొరకలేదు, నేడు కైకిలోల్లు దొరకడం లేదని పేర్కొన్నారు. గజ్వేల్‌ను కేసీఆర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.