ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో బీజేపీ సంచలన విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ETG సర్వే తెలిపింది. 26 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 26 స్థానాల్లో నెగ్గుతుందని ,ఇండియా కూటమి కనీస ప్రభావం చూపదని వెల్లడించింది.
బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు NDTV జ న్ కి బాత్ తెలిపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ: 21-26, టీఎంసీ: 18-16, కాంగ్రెస్: 0-2, సీపీఎం : 0-1 గెలిచే అవకాశం ఉందని ఆ సర్వే సంస్థ అంచనా వేసింది.
ఇక బిహార్ లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని India Today Axis My India తెలిపింది. 40 సీట్లకు గానూ ఎన్డీఏ: 29-33, ఇండియా: 07-10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా పార్టీలకు సొంతంగా బీజేపీ: 13-15, జేడీయూ: 9-11, ఆర్జేడీ: 6-7, కాంగ్రెస్: 1-2, చిరాగ్ పార్టీకి 5 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.