మత విద్వేశాలు రెచ్చగొడుతున్న బీజేపీ : వి. హనుమంతరావు

-

భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…బీజేపీ విద్వేషంతో రాజకీయం చేస్తుంటే, దేశ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రేమతో రాజకీయం చేస్తున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు జనాభాలో ఎక్కువగా ఉన్నాయని ,అందుకే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని ఆయన ప్రకటించారని అన్నారు.

అలాగే రిజర్వేషన్లపై ఉన్న గరిష్ట పరిమితి సీలింగ్ ఎత్తేస్తామని అన్నారని తెలిపారు. రాహుల్ గాంధీ రక్తంలోనే పేదల గురించి ఆలోచించే గుణం ఉందని,సోనియా గాంధీకి రెండు సార్లు అవకాశం వచ్చినా ప్రధాని పదవి తీసుకోలేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.రాహుల్ గాంధీకి అవకాశం ఉన్నా పార్టీ అధ్యక్ష పదవి తీసుకోలేదన్నారు.పేదవాడికి ఆత్మ గౌరవం ఉండేలా మేనిఫెస్టో తయారు చేశారని ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే అందరికీ న్యాయం జరుగుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, బడుగు, బలహీనవర్గాలు రాహుల్ గాంధీకి ఓటేసి ప్రధానిని చేయాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టే దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news