ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించి రాకపోవడంతో ఒక పార్టీ నుండి మరొక పార్టీ లోకి జంప్ అవుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ని ఓడించడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ ఫిరాయింపులు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే టికెట్ దక్కని పలువురు కీలక నేతలు పార్టీలకు గుడ్ బై చెప్పగా కొంతమంది పార్టీలో ఉంటూనే నిరసన తెలియజేస్తున్నారు.
తాజాగా జనసేన నేత పోతిన మహేష్ విశాఖ వెస్ట్ నుండి టికెట్ ఆశించినప్పటికి ఆ సీటు దక్కకపోవడంతో గత కొంత కాలంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో ఆయన రాజీనామాకు సిద్దపడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మీడియాతో మాట్లాడుతూ మహేష్ తనకు రాదని తేలిపోయిందని, ఇక ఎదురు చూసి లాభం లేదని డిసైడ్ అయ్యానని వెల్లడించారు. మరో రెండు మూడు రోజుల్లోనే తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని తెలిపారు.