రష్యాకు షాక్ ఇచ్చిన అంతర్జాతీయ కోర్ట్…. యుద్ధం ఆపాలంటూ తీర్పు

-

రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించి మూడు వారాలు దాటింది. రోజు రోజుకు యుద్ధ తీవ్రత ఎక్కువ అవుతోంది. ఓ వైపు అమెరికా, యూరోపయిన్ దేశాలు, కెనడా వంటి దేశాలు ఆంక్షలు విధిస్తున్నా రష్యా లెక్క చేయడం లేదు. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. ముఖ్యంగా కీవ్ నగరాన్ని ఆక్రమించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ ఆర్మీ కూడా తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నాయి. దీంతో ఉక్రోశంతో మరింత ఎక్కువగా దాడులకు తెగబడుతోంది రష్యా. ఇదిలా ఉంటే ఇటీవల రష్యా దురాక్రమణపై ఉక్రెయిన్ అంతర్జాతీయ కోర్ట్ లో ఫిర్యాదు చేసింది. రష్యా దురాక్రమణపై చర్యలు తీసుకోవాలని కోరింది. 

ఉక్రెయిన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ పై మిలటరీ దాడిని ఆపేయాలంటూ తీర్పు చెప్పింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ బలగాాలను వెనక్కి రప్పించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అంతర్జాతీయ కోర్ట్ తీర్పుపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షడు జెలన్ స్కీ.. కోర్ట్ లో మేమే గెలిచామని, ఇంటర్నేషనల్ లా ప్రకారం కోర్టు ఆదేశాలను రష్యా తప్పక పాటించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news