జీ20 తర్వాత క్వాడ్ సదస్సు.. భారత్‌లోనే..!

-

భారత దేశం మరో అంతర్జాతీయ గ్రూపునకు అధ్యక్షత వహించే అవకాశాలు ఉన్నాయి. జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు ఈ నెల 9వ, 10వ తేదీల్లో భారత్ విజయవంతంగా అధ్యక్షత వహించింది. ఇప్పుడు భారత్ మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతున్నది. క్వాడ్ సదస్సును కూడా భారత్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.రష్యా, చైనాలు కూడా భారత్ పై ప్రశంసలు కురిపించాయి. ఈ దేశాల ప్రశంసలు పొందినప్పటికీ ఈ రెండు దేశాలూ వ్యతిరేకించే క్వాడ్ సదస్సు నిర్వహణకు మన దేశం ఏమీ వెనుకడుగు వేయడం లేదని సమాచారం.

ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టడానికి ఈ కూటమి ఏర్పడిందని రష్యా ఆరోపించింది. చైనా కూడా క్వాడ్ కూటమిపై గుర్రుగా ఉన్నది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాలతో ఈ కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. 2024 తొలినాళ్లలో క్వాడ్ సదస్సును నిర్వహించడానికి మోడీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. ఇందుకోసం వచ్చిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంది. అయితే. స్పష్టమైన తేదీ ఇంకా ఖరారు కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news