ఆ నదిలో మునిగితే యవ్వనంగా మారతారట.. క్యూ కడుతున్న టూరిస్టులు

-

పాత సినిమాల్లో చూపించేవాళ్లు.. పవర్‌ఫుల్‌ వాటర్‌ తాగితే.. యవ్వనంగా ఉంటారని, అసలు ముసలితనం రాదని.. అలాంటి ఒక వాటర్ నిజంగానే ఉంటే ఒక నదే అలాంటిది అయితే ఇంకేమైనా ఉందా.. అందులోకి వెళ్లి ఒక్కసారి మునిగితే చాలు.. అందంగా మారిపోతారు. ఆ నదిలో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయట.. అందుకే అందులో మునగడానికి టూరిసట్లు ఎగబడుతున్నారు.

ఉత్తరాఖండ్ లోని బధాని తాల్ పర్యాటకులను ఎంతగానో ఆకర్శిస్తుంది. ఇది కేవలం పర్యాటక ప్రదేశంగా మాత్రమే కాకుండా.. ఎన్నో అద్భుతాలకు కూడా నిలయమని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ అడవిలో అనేక వనమూలికలున్నాయని, ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా కూడా దూరమవుతాయని ప్రతీతి.. అంతేకాకుండా ఈ ప్రదేశంలో అనేక సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తుంటారు.

అదే విధంగా మకర సంక్రాంతి, పూర్ణిమ, అమావాస్య వంటి ప్రత్యేక పర్వదినాలలో ఇక్కడ స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడ చెరువులో స్నానం చేస్తే అందంగా మారతారట. దీనిలో అనేక వనమూలికలు, ఔషధగుణాలున్నట్లు సమాచారం. ఇక్కడి పర్వతాలు, అందమైన ప్రదేశాలకు టూరిస్టులకు కట్టిపడేస్తుంటాయి. ఇక్కడ వారికి ప్రకృతితో ముఖాముఖి వచ్చే అవకాశం లభిస్తుంది. వీటిలో ఒకటి బధాని తాల్, ఇక్కడ దాని అందం మీ దృష్టిని మరల్చలేనంతగా ఉంటుంది. బధాని తాల్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఈ సరస్సును చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

రుద్రప్రయాగ్ జిల్లాలోని జఖోలి బ్లాక్‌లో ఉన్న ఈ చెరువు సముద్ర మట్టానికి 7000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది మాయాలి మోటర్‌వేపై లక్షతార్ గడ్ నది లోయ వాలుపై ఉంది. రుద్రప్రయాగ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 62 కిలోమీటర్లు. దాదాపు 200 మీటర్లు నడిచి ఇక్కడికి చేరుకోవచ్చు. ప్రత్యేక పర్వదినాలలో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు అధిక సంఖ్యలో వస్తుంటారు. బైసాఖి రోజున చెరువు దగ్గర ఒక జాతర నిర్వహించబడుతుంది. ఇందులో బధాని, ఖలియన్, మునియాఘర్, జఖోలి, కపానియా, జఖ్‌వాడి కోర్ట్‌తో సహా ఈ ప్రాంతంలోని అనేక గ్రామాల ప్రజలు వస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news