ఏపీ ప్రభుత్వం మీద బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020 ప్రణాళిక అన్నారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 2050 విజన్ అంటున్నారని ఆయన అన్నారు. టీచర్లు జీతాలు లేక ఉపాధి కోసం పనలు చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని వారిని ఆదుకోవాలని కోరారు.
రాష్ట్రంలో పరిస్థితులు ఏ మాత్రం సానుకూలంగా లేవన్న ఆయన కోట్లు పెట్టుబడి పెట్టిన కాంట్రాక్టర్లకు 15నెలలుగా బిల్లులు లేవని, నిర్మాణ రంగంలో ఉన్న వారు అడుక్కుతినే దుస్థితికి ప్రభుత్వం దిగజార్చిందని అన్నారు. అడగని వారికి సైతం నవరత్నాలు అంటున్నారని కానీ డబ్బు పెట్టిన కాంట్రాక్టర్లని పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రైవేటు కోవిడ్ హాస్పటల్ దోపిడీని ప్రభుత్వం పట్టించకోవడం లేదన్న ఆయన కోవిడ్ కష్టసమయాన్ని ప్రైవేటు హాస్పటల్స్ సొమ్ము చేసుకుంటున్నాయని అన్నారు. ఆసుపత్రుల్లో ప్రమాదం జరిగితే ఒక్క పేషేంట్ కూడ బయటపడే పరిస్థితి లేదని ఆయన అన్నారు.