పండుగ సీజన్ లో ఈ-కామర్స్ సంస్థలు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. ఇప్పటికే దసరా ముగించుకుని దీపావళి సేల్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే ఈ పండుగ సీజన్ లో ఇంట్లోకి ఏమైనా ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.. అయితే మీకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజార్ భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారీ తగ్గింపులతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ వాషింగ్ మెషిన్, ఎయిర్ కండీషనర్ (ఏసీ), రిఫ్రిజిరేటర్, ఫ్రిజ్ వంటి ప్రొడక్ట్స్ పై ఏకంగా 55 శాతం తగ్గింపును ప్రకటించింది. వీటితో పాటు పలు బ్రాండెడ్ కంపెనీల ప్రొడక్టులను అమెజాన్ ఆకర్షణీయమైన ఆఫర్లకు విక్రయిస్తోంది. ఈ దీపావళి ఫెస్టివల్ సీజన్ లో మీరు కూడా ఎమైనా కొనుగోలు చేయాలని భావిస్తే ఇదే మంచి సమయం.
అమెజాన్ హయర్ కంపెనీకి చెందిన సైడ్ బై సైడ్ ఫ్రిజ్ ఇప్పుడు రూ.52 వేలకే అందిస్తోంది. దీని అసలు ధర రూ.లక్ష ఉంటుంది. అలాంటిది భారీ తగ్గింపుతో కస్టమర్ల ముందు ఉంచింది. అలాగే బేసిక్స్ ఫ్రోస్ట్ ఫ్రీ అండ్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ ధర రూ.40,999 అసలు ధర ఉంది. దీనిపై అమెజాన్ రూ.6000 తగ్గించింది. అంటే ఈ ఫ్రిజ్ ను రూ.34,000కు పొందవచ్చు.
శాంసంగ్ ఫ్రిజ్ లపై కూడా ఆఫర్లు ఉంచింది. రూ.22 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఎల్ జీ ఫ్రిజ్ లపై కూడా డిస్కౌండ్ అందించింది. ఇక ఏసీల విషయానికి వస్తే.. పానాసోనిక్ 1.5 టన్ను ఏసీపై రూ.14,500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కంపెనీకి చెందిన ఇన్వర్టర్ ఏసీపై రూ.22 వేల డిస్కౌంట్ లభిస్తోంది. దీంతోపాటుగా ఎల్ జీ స్లిప్ ఏసీపై రూ.19,950 డిస్కౌంట్ ప్రకటించింది. శాంసంగ్ ఫుల్లీ ఆటోమెటిక్ వాషింగ్ మెషిన్ పై రూ.5,900 తగ్గింపు లభిస్తోంది. ఇప్పుడు ఈ వాషింగ్ మెషిన్ ను రూ.20,990కే కొనొచ్చు. అలాగే గోద్రేజ్ 6.2 కేజీ ఫుల్లీ ఆటోమెటిక్ వాషింగ్ మెషిన్ ను కేవలం రూ.10,990కే పొందవచ్చు.