గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాల్లో తప్పితే ఎక్కడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత నుంచి ఈ రోజు దాకా ఏ సబ్ స్టేషన్ కు 24 గంటలు త్రిఫేజ్ కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. 20 సంవత్సరాల క్రితమే రిటైర్ అయిన వ్యక్తిని కీలక స్థానంలో నియమించి నిజాలు బయటపడకుండా చేస్తున్నారని విమర్శించారు. కీలక స్థానాలన్ని రిటైర్ ఉద్యోగులకు ఎందుకు ప్రభుత్వం ఇస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో త్రిఫేజ్ కరెంట్ ని అనధికారికంగా, మౌఖిక ఆదేశాల మేరకు బంద్ చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయానికి వీలయితే పగటి పూట 9 గంటలే విద్యుత్ ఇవ్వాలని పై అధికారులకు నుంచి ఆదేశాలు వచ్చాయని రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నారని ఏ రైతు చెప్పిన శిక్షకు సిద్ధమే అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఒక వేళ కరెంట్ వస్తలేదని రైతులు చెబితే అధికారులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దంగా ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు.
గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటలో తప్పితే ఎక్కడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు: రఘునందన్ రావు
-