బాలయ్య సినిమాలో కార్తీకదీపం వంటలక్క..?

-

మాటీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ దాదాపు మీ అందరికీ తెలిసే ఉంటుంది.అప్పట్లో ఈ సీరియల్ ని బుల్లితెర బాహుబలి గా కూడా పోల్చారు.ఈ సీరియల్ టీఆర్పీ సృష్టించిన అద్భుతాలు అన్నీఇన్నీ కావు.దేశంలోనే అత్యధిక టి ఆర్ పి రేటింగ్ ను సాధించిన సీరియల్ గా రికార్డు సృష్టించింది.డాక్టర్ బాబు భార్య గా, ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన దీప ఫ్యామిలీ ఆడియన్స్ నే కాకుండా మాస్ ప్రేక్షకులను కూడా అలరించింది.సోషల్ మీడియాలో ఆమెపై చాలా మీమ్స్ పుట్టుకొచ్చాయి.అయితే ఇటీవల సీరియల్లో వారి క్యారెక్టర్స్ క్లోజ్ అయ్యాయి.దీప తో పాటు డాక్టర్ బాబు చనిపోవడంతో సీరియల్ లో వారి క్యారెక్టర్స్ లేకుండాా అయిపోయాయి.

దీంతో రేటింగ్ కూడా పడిపోయింది.ఇక దీప క్యారెక్టర్ లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.కాగా కార్తీకదీపం ఫేమ్ ‘ ప్రేమి విశ్వనాథ్’ సినిమాల్లో నటించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.ఈ బుల్లితెర హీరోయిన్ కు గతంలోనే అనేక ఆఫర్లు వచ్చాయి.కానీ సీరియల్ షూటింగ్ కు ప్రాబ్లం అవుతుందని ఒప్పుకొలేదట.అయితే తాజాగా ఈ అమ్మడు నందమూరి బాలకృష్ణ హీరోగా- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news