ప్రియుడి పెళ్లి మండపంలో ప్రియురాలిపై…పెళ్లి కొడుకు బంధువులు దాడి చేసిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించి,పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తి, పెళ్లి చేసుకుంటుండగా… అక్కడకు వచ్చిన ప్రియురాలిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన రజిని అనే మహిళను శ్రీనాధ్ అనే వ్యక్తిని ప్రేమించింది.
అయితే.. రజినీని కాదని.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు శ్రీనాధ్. ఇందులో భాగంగానే ఇవాళ ఖమ్మంలోని ఓ పంక్షన్ హాల్ లో శ్రీనాధ్ పెళ్లి జరుగుతుండగా ప్రియురాలు రజినీ అక్కడికి వచ్చింది.
అయితే… మండపంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా రజినీని విచక్షణ రహితంగా కొట్టారు శ్రీనాధ్ బంధువులు. జుట్టు పట్టి ఈడ్చుకుంటూ వెళ్లారు. ప్రియుడు శ్రీనాధ్ ను ప్రేమించానని..పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అయినా వినిపించుకోకుండా ఆమెను కొట్టారు. ఇంత జరుగుతున్నా.. అక్కడున్న వారు ఎవరూ స్పందించలేదు. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.