లోక్‌సభలో రాహుల్ గాంధీ కులంపై, కులగణనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతుండగా తాజాగా రాహుల్ కులంపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇమేజ్‌తో కాంగ్రెస్ సీట్లు పెరిగాయని వారు అనుకుంటున్నారని, అందుకే కులం ఆధారంగా విద్వేషం వ్యాప్తి చేస్తున్నారని యూపీ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జర్ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో వారెక్కడా అభివృద్ధి గురించి మాట్లాడలేదని, ప్రజలు ఇది అర్ధం చేసుకున్నారని, కాంగ్రెస్‌పై భ్రమలు తొలగిపోయాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలని తాను రాహుల్, అఖిలేష్ యాదవ్‌లను కోరుతున్నానని చెప్పారు. రాహుల్ గాంధీ కులం ఏంటి..? ఫిరోజ్ ఖాన్ మనవడు ఎలా ఉంటాడు..? ఆయన హిందువు ఎలా అవుతారు..? ఆయన తప్పుడు వివరాలు ఇచ్చారు, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కోరారు. రాహుల్ ఫిరోజ్ ఖాన్ మనవడు, ఆయన తల్లి ఓ క్రిస్టియన్ అని వ్యాఖ్యానించారు. కుల గణన జరగాలని, తాము దీనికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.