వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..బస్టాండ్ లోనే ఏకంగా !

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబ పాలన అధికార దుర్వినియోగం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బస్టాండ్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భర్త రాజారామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారని సమాచారం అందుతోంది. ఈ తరునంలో పాలకుర్తి నియోజకవర్గంలో అధికార దుర్వినియోగంతో ఇబ్బంది పడుతున్నారట ప్రజలు.

Congress MLA Yashaswini Reddy

రాయపర్తి బస్టాండ్ ప్రాంగణం నిండా వాహనాలు పార్క్ చేశారట కాంగ్రెస్ శ్రేణులు. దీంతో బస్టాండ్​లోకి వచ్చేందుకు ప్లేస్ లేకపోవడంతో ఆగకుండానే వెళ్లిపోయాయట బస్సులు. దీంతో మండే ఎండలో రోడ్డుపైనే నిలబడి ఇబ్బందులు పడ్డారట ప్రయాణికులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భర్త బర్త్ డే అయితే మమ్మల్నెందుకు ఇబ్బందులకు గురిచేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ప్రజలు. అయితే… ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ… గులాబీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news