జ‌గ‌న్‌తో బీజేపీ దోస్తీ.. నిజ‌మేనా… ఈ మాట చెపుతోంది వాళ్లే…!

-

ఏపీ స‌ర్కారు అధినేత‌, సీఎం జ‌గ‌న్‌తో కేంద్రంలోని బీజేపీ నేత‌లు దోస్తీ క‌ట్టారా ?  అందుకే మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంపై వారు నైస్‌గా త‌ప్పుకొన్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు బీజేపీలోకి కొంద‌రు లీకువీరులు. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు రెండు తెలుగు రాష్ట్రాల‌పైనా క‌న్నేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ వీలునుబ‌ట్టి అధికారంలోకి రావాల‌ని క‌లలు కంటున్నారు. అయితే, ఈ విష‌యంలో ఏపీని ప‌క్క‌న పెట్టార‌ని తాజాగా అందిన స‌మాచారం. ఇక్క‌డ ఎలాగూ.. కొన్ని హామీలు ఉన్నాయి. ఒక‌టి ప్ర‌త్యేక హోదా. దీనిని ఎలాగూ ఇచ్చేది లేద‌ని తేల్చేశారు. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు బీజేపీ ఓటేసేది లేద‌ని చెప్పేస్తున్నారు.


ఇక‌, ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ తో దోస్తీ చేస్తే.. ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా.. ప‌రోక్షంగా అయినా అధికారంలో ఉన్న‌ట్టే క‌దా ?! అంటున్నార‌ట కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు. తాజాగా తెలంగాణ‌లో పార్టీ కార్యాల‌య‌కు శంకుస్థాప‌న చేసిన  బీజేపీ జాతీయ సార‌థి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా.. ఏపీపై ప‌న్నెత్తు మాట అన‌కుండా.. తెలుగు రాజ‌కీయాల‌ను వేడెక్కించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కంతో దేశంలోని 55 కోట్ల మందికి ప్ర‌యోజనం క‌లుగుతోంటే.. దాన్ని అమ‌లు చేయ‌కుండా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు టీఆర్ఎస్ న‌ష్టం చేకూరుస్తోంద‌ని మండిప‌డ్డారు.

అంతేకాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమ‌ర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోపించారు. రాష్ట్రంలో 7 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి.. 50 వేలకు మించి టీఆర్ఎస్ స‌ర్కార్ ఇవ్వ‌లేక‌పోయింద‌ని ఎద్దేవా చేశారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారని మండిప‌డ్డారు. మ‌రి ఇంత ఫైర్‌లోనూ ఏపీ సీఎం జ‌గ‌న్ గురించి న‌డ్డా ప‌న్నెత్తు మాట అన‌లేదు. ఇదే విష‌యంపై రాష్ట్ర బీజేపీ నేత‌ల‌ను క‌దిలిస్తే.. కొంద‌రు లీకు వీరులు చెప్పిన మాటేంటంటే.. జ‌గ‌న్‌తో మావోళ్లు దోస్తీ క‌ట్టారు. అందుకే ఏమీ అన‌డం లేదు. అని సైలెంట్‌గా చెప్పేశారు.

ఇక ఏపీలో బీజేపీ బ‌లంగా లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అధికారంలోకి వ‌స్తామ‌న్న గ్యారెంటీ లేదు. తెలంగాణలో ఆ పార్టీ కాంగ్రెస్‌ను బీట్ చేసి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స్తాయికి వెళుతోంది. ఈ క్ర‌మంలోనే ఏపీ బ‌లంగా ఉన్న జ‌గ‌న్ అవ‌స‌రం బీజేపీకి లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ఉంది. అందుకే జ‌గ‌న్‌తో బీజేపీ లోప‌ల ఎలా ఉన్నా ?  పైకి మాత్రం స్నేహం హ‌స్తం అందిస్తోంద‌న్న వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news