తెలంగాణలోని మీడియా ఛానెళ్లపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల పక్షాన నిలుస్తూ ప్రశ్నించే మీడియా సంస్థలు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ కు మద్దతుగా నిలవాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తీన్మార్ మల్లన్న కు చెందిన Q న్యూస్ ఛానల్ తోపాటు, కాళోజీ ఛానల్స్ కార్యాలయాలకు వెళ్లి సంఘీభావం తెలపాలని నిర్ణయం తీసుకుంది బీజేపీ.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆయా ఛానల్ కార్యాలయాలను సందర్శించేందుకు పార్టీ కార్యాలయం నుండి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి క్రిష్ణప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ తదితరులు బయలుదేరారు. కాగా.. నిన్న తెలంగాణ విఠల్ మరియు.. తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.