తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి అసంత్రుప్తులను బీజేపీలో చేర్చుకునేందుకు బీజేపీ పార్టీ సిద్దం అవుతోంది. ఇందులో భాగంగానే ఆపార్టీల్లో పలువురు నేతల్ని కూడా ఆకర్షిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసుకునే యోచనలో బీజేపీ ఉంది. దీనిపై ఆపార్టీ నాయకులే .. మేం నేతలను చేర్చుకుని బలపడతామని బహిరంగంగానే చెబుతున్నారు.
తాజాగా బీజేపీలోకి క్యూన్యుస్ అధినేత తీన్మార్ మల్లన్న, మాజీ టీఎస్ఫీఎస్సీ సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ ఇద్దరూ చేరనున్నారు. నేడు విఠల్ బీజేపీలోకి చేరుతుండగా.. రేపు తీన్మార్ మల్లన్న కాషాయ కండువా కప్పుకోనున్నారు. సంబంధించి ఇప్పటికే అంతా సిద్ధం అయింది. జాతీయ, రాష్ట్ర బీజేపీ నాయకుల సమక్షంలో వీరిద్దరు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం కేసులు పెట్టిన సందర్భంలో అతనికి బీజేపీ పార్టీ అండగా నిలిచింది. మరోవైపు విఠల్ తో చర్చలు జరిపి కాషాయ కండువా కప్పుకునేలా ఒప్పించారు పార్టీ నాయకులు.
Completed all things thanks to @bandisanjay_bjp @Arvindharmapuri @kishanreddybjp @vivekvenkatswam @apjithender @aruna_dk @PMuralidharRao @RaghunandanraoM @AmitShah @JPNadda @PMOIndia and all others 7 th December is conform
— Teenmar Mallanna (@TeenmarMallanna) December 4, 2021