సంస‌ద్ టీవీ యాంక‌ర్ బాధ్య‌త‌ల‌కు రాజీనామా చేసిన ఎంపీ

-

రాజ్య స‌భ టీవీ యాంక‌ర్ బాధ్య‌తల నుంచి శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది త‌ప్పుకున్నారు. దీనికి సంబంధించిన రాజీనామా లేఖ ను రాజ్య‌స‌భ చైర్మెన్ వెంక‌య్య నాయుడు కు పంపించారు. అయితే పార్లంమెంటు స‌మావేశాల్లో భాగం గా రాజ్య స‌భ‌లో వికృత ప్ర‌వ‌ర్త‌న చేస్తున్నార‌ని 12 మంది ఎంపీ ల‌ను వెంక‌య్య నాయుడు స‌స్పెండ్ చేశారు.ఈ 12 మంది లో ప్రియాంక చ‌తుర్వేది కూడా ఉన్నారు. అయితే త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డం పై ప్రియాంక చ‌తుర్వేది ఖండించారు.

ఈ నిర్ణయాన్ని వెంక‌య్య నాయుడు ఏక ప‌క్షం గా తీసుకున్నాడ‌ని ఆరోపించారు. అందు కోస‌మే సంస‌ద్ టీ వీ షో మేరీ క‌హానీ యాంక‌ర్ బాధ్య‌తల నుంచి త‌ప్పుకుంటున్నాని తెలిపింది. కాగ సస్పెండ్ అయిన ఎంపీ ల లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు. తృణ‌మూల్ కాంగ్రెస్, శివ‌సేన పార్టీ ల నుంచి ఇద్ద‌రు, సీపీఐ, సీపీఎం పార్టీ ల నుంచి ఒక్క‌క్కొరు ఉన్నారు. కాగ ఎంపీ ల‌ను సస్పెండ్ చేయ‌డం పట్ల ప్ర‌తిప‌క్ష‌లు తీవ్రం గా మండి ప‌డుతున్నాయి. ప్ర‌తి రోజు పార్ల‌మెంటు ఎదుట ఉన్న గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news