దేశంలో ఏ పార్టీ కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదు: లక్ష్మణ్

-

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నాడనే వార్తలపై బీజేపీ ఎటాక్ చేస్తోంది. ఇప్పటికే తరుణ్ చుగ్ టీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రతిపాదనలపై సెటైర్లు వేశారు. ప్రధాని కావాలనే ఆశ అందరికీ ఉంటుందని..కానీ వచ్చే ఎన్నికల్లో కూడా మోదీనే ప్రధాని అవుతారని తరుణ్ చుగ్ అన్నారు. ఇదిలా ఉంటే రాజ్యసభ  సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ టీఆర్ఎస్ పై కీలక కామెంట్లు చేశారు. కేసీఆర్ కు పూర్తిస్వేచ్ఛ ఉందని.. ఆయన ఏ పార్టీ అయిన పెట్టుకోవచ్చని అన్నారు. ఉట్టికి ఎగలేనమ్మ..స్వర్గానికి ఎగినట్లు కేసీఆర్ తీరు ఉందని విమర్శించారు. ప్రత్యామ్నాయ శక్తి అంటే కుటుంబ పాలన, అవినీతా..? అని ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని ఆయన అన్నారు. మోదీని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని అన్నారు. కేసీఆర్ ను దేశంలో ఏ పార్టీ నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ చేశాడు.. ఇక బంగారు భారతదేశాన్ని తయారు చేస్తారట అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫ్రంట్ కు, టెంట్ కు ఆదరణ లేదని అన్నారు. బీజేపీ దేశాన్ని విచ్ఛినం చేయాలనుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. సీఎం ప్రజల గురించి పట్టించుకోవడం మానేశాడు కాబట్టే గవర్నర్ మహిళా దర్బార్ పెట్టారని లక్ష్మణ్ అన్నారు.

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version