గాంధీ భవన్ చుట్టూ తిరిగితే పదవులు రావు…ప్రజల్లో తిరగండి – రేవంత్ రెడ్డి

-

గాంధీ భవన్ లో టీపీసీసీ ముఖ్య నాయకుల సమావేశం.. ఇవాళ జరిగింది. ఈ సమావేశం లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి…మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది…గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్టే.. ప్రతి కార్యకర్త స్పందించాలన్నారు.రాహుల్ గాంధీ గారు సోమవారం నాడు ఈ.డి కార్యాలయానికి వెళ్లి బయటకు వచ్చేంతవరకు ఈ.డి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయాలి..15వ తేదీన అల్ పార్టీ మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయి. ఈ విషయంలో పోలీసులు, ప్రభుత్వం చేతులైతేసింది..ఈ విషయంలో అన్ని పార్టీలతో సమావేశం పెడతాం. బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలను కూడా ఆహ్వానించుదామన్నారు. రైతు రచ్చబండ కార్యక్రమాలు ఈ నెల 21 వరకు చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమాన్ని మరో 15 రోజులు పొగిస్తున్నాం..నాయకులు పని చేయకపోతే పదవులు రావు.. గాంధీభవన్ చుట్టూ తిరిగితే పదవులు రావని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు ఏఐసీసీ కి నివేదికలు వెళ్తున్నాయి.పనిచేసి ప్రజల్లో నిత్యం ఉండే వాళ్ళకే పదవులు వస్తాయన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version