మహిళ తల దువ్విన ఎలుగుబంటి… వీడియో వైరల్…!

-

ఎలుగుబంటి ఒక మహిళ తల దువ్విన ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. సాధారణంగా ఎలుగుబంటిని చూస్తేనే ఒళ్ళు జలతరిస్తుంది… దాని బారి నుంచి రక్షించుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటాం… కనీసం దాని దగ్గరకు వెళ్ళాలి అన్నా సరే భయపడతాం… వాటిని జూలో మినహా ఎక్కడా చూడటానికి ఇష్టపడం… కాని ఇక్కడ ఒక ఎలుగు బంటి మహిళ తలదువ్వింది. వివరాల్లోకి వెళితే మెక్సికోలోని మోంటెర్రేలోని చిపిన్క్యూ ఎకోలాజికల్ పార్క్ లో ఒక మహిళ నిలబడి ఉండగా… రెండు ఎలుగు బంట్లు చెత్తబుట్టలో ఆహారం కోసం వేటాడుతున్నాయి.

నల్ల ఎలుగుబంటి ఒకటి గుంపులో నిలబడిన మహిళ వద్దకు వస్తుంది… ఆ ఎలుగుబంటి దాని వెనుక కాళ్ళపై నిలబడి… తలవద్దకు చేరుకొని ఆమె జుట్టుని దాని కాళ్ళతో సరి చేస్తుంది. తరువాత, అది ప్రశాంతంగా వెనుక కూర్చుని ఆమె నుండి దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ మహిళ… పర్యాటకులు ప్రశాంతంగా ఉండాలని మరియు ఎలుగుబంట్లు వెళ్ళనివ్వమని పర్యాటకులను విజ్ఞప్తి చేస్తుంది. దీనిని అక్కడ ఉన్న కొందరు పర్యాటకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దాదాపు పది లక్షల మంది వీక్షించారు.

వీడియో వైరల్ అయిన తరువాత, శాంటా కాటరినా సివిల్ ప్రొటెక్షన్ ఎలుగుబంట్లు తినిపించడం లేదా ఫోటో తీయడం మానుకోవాలని పార్కు సందర్శకులను కోరింది. బేర్ స్మార్ట్ సొసైటీ ప్రకారం, నల్ల ఎలుగుబంట్లు గోధుమ లేదా గ్రిజ్లీ ఎలుగుబంట్లు కంటే నెమ్మదిగా ఉంటాయని మనుషులు ఉన్న చోట ఉండటానికి అవి ఇష్టపడతాయని కొందఱు అనవసరంగా వాటిపై దాడులు చేస్తారు గాని అసలు అవి ఏమీ చేయవని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… 2017 లో ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news