రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ లు విజృంభిస్తున్నాయి: సోము వీర్రాజు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకృత్యాలు, హత్యలు సాధారణమై పోయాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.రేపల్లెలో జరిగిన సామూహిక అత్యాచార ఘటననపై ఆయన తీవ్రంగా స్పందించారు.బాధితురాలి భర్త సంఘటన సమయంలో రైల్వే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా పోలీసులు పట్టించుకోకపోవడం, బయటి పోలీసులు వచ్చే లోపే అత్యాచారంజరిగిపోవడం పై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలపై ఇటువంటి దుర్నీతి కొత్తేమీ కాదని..వైసీపీ పాలన లో ఎటువంటి అకృత్యాలు నిత్యకృత్యమైపోతున్నాయని, అసలు ప్రభుత్వం ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలో డ్యూటీలో ఉన్న సిబ్బంది ఒక మానసిక వికలాంగురాలిపై తాడిపత్రి లోనే బంధించి అత్యాచారం చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.”రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ లు విజృంభిస్తున్నాయి అని” రాజమండ్రిలో రైలు దిగి ఇంటికి వెళుతున్న కార్మికుడి వద్ద ఉన్న ఫోన్ బ్లేడ్ బ్యాచ్ దొంగలు లాక్కొని, డబ్బు కోసం వెతికి, జేబులో డబ్బులు లేకుండా తిరుగుతున్నందుకు ఆగ్రహించి అతన్ని చంపేశారని..ఇటువంటి ఘటనే గుంటూరులో మరొకటి జరిగిందని సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news