రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై ఎన్ హెచ్ ఆర్సీలో ఫిర్యాదు

-

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కాకరేపుతోంది. రాహుల్ గాంధీ ఓయూకు రావడాన్ని టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. ఇప్పటికే వీసీ రాహుల్ సభకు అనుమతి ఇవ్వలేదు. వీసి నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ, విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే ముందుగా అమరవీరులు కుటుంబాలను పరామర్శించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. 

ఇదిలా ఉంటే రాహుల్, రేవంత్ రెడ్డిలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపణ చేశారు. ఓయూలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశాంతంగా ఉన్న విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టడానికే రాహుల్ ఓయూ పర్యటనకు వస్తున్నారంటూ విమర్శలు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్లు విడుదల చేసిందని… విద్యార్థులంతా తమ స్టడీలపై కాన్సన్ట్రేట్ చేస్తున్న సమయంలో కాంగ్రెస్ యూనివర్సిటీ ప్రశాంతతకు భంగం కలిగిస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news