తీన్మార్ మ‌ల్లన్న‌పై మ‌రో బ్లాక్ మెయిలింగ్ కేసు..!

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో తీన్మార్ మల్లన్న తో సహా ఐదుగురిపై కేసు నమోదు అయ్యింది. తీన్మార్ మల్లన్న పాదయాత్ర కోసం 20 లక్షలు ఇవ్వాలని కల్లు వ్యాపారి జయవర్ధన్ గౌడ్ డిమాండ్ ను డిమాండ్ చేసిన‌ట్టు ఆరోపిస్తూ ఆయ‌న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టులో రూ.5 లక్షలు చెల్లించాన‌ని వ్యాపారి చెప్పారు. అయితే మరో 15 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్టు చెబుతున్నాడు.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న
Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

జ‌య‌వ‌ర్ధ‌న్ గౌడ్ ఫిర్యాదు మేర‌కు ఉప్పు సంతోష్, రాధకిషన్, రాజాగౌడ్, సాయగౌడ్, తీన్మార్ మల్లన్న లపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ఓ వ్య‌క్తి త‌న‌ను తీన్మార్ మ‌ల్ల‌న్న డ‌బ్బుల కోసం డిమాండ్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ కేసులో అరెస్ట్ అయ్యిన మ‌ల్ల‌న్న ను పోలీసులు ప్ర‌స్తుతం విచారిస్తున్నారు.